Tuesday, July 1, 2025
E-PAPER
Homeకరీంనగర్ఇందిరా నగర్ వద్ద బస్సు ఆగే విదంగా చర్యలు తీసుకోండి

ఇందిరా నగర్ వద్ద బస్సు ఆగే విదంగా చర్యలు తీసుకోండి

- Advertisement -


– ఎమ్మెల్యేకు ఇందిరా నగర్ వాసుల వినతి
నవతెలంగాణ-యైటింక్లయిన్ కాలనీ:
8వ కాలనీ ఇందిరా నగర్ వద్ద బస్సు ఆగే విదంగా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ని ఇందిరా నగర్ వాసులు కోరారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి ఎన్నో ఏళ్లుగా ఇందిరా నగర్ నుండి గోదావరిఖని,పెద్దపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఆర్టీసి బస్సు ఆపడం లేదని దీంతో 1 కిలోమీటర్ మేర నడిచి వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.స్పందించిన ఎమ్మెల్యే గోదావరిఖని డిపో మేనేజర్ కు ఫోన్ చేసి బస్సు ఆగేవిదంగా చూడాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజిరెడ్డి,రేషవేణి స్వరూప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -