Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంబాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు..

బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బాణసంచా కార్మాగారంలో భారీ పేలుడు సంభవించిన ఘటన ఇవాళ ఉదయం తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివకాశిలోని ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో మందుగుండు సామగ్రి మిక్స్ చేస్తుండగా.. ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఇద్దరు మహిళలు సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పేలుడు ధాటికి మొత్తం మూడు గదులు పూర్తిగా ధ్వసమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. స్పాట్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -