Wednesday, July 2, 2025
E-PAPER
Homeజాతీయంఐఎన్ఎస్ త‌మ‌ల్ జ‌ల‌ప్ర‌వేశం

ఐఎన్ఎస్ త‌మ‌ల్ జ‌ల‌ప్ర‌వేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: యుద్ధ‌నౌక ఐఎన్ఎస్ త‌మ‌ల్‌ను ఇవాళ జ‌ల‌ప్ర‌వేశం చేయ‌నుంది. భార‌తీయ నౌకాద‌ళం కోసం దీన్ని నిర్మించారు. ర‌ష్యాలోని కాలినిన్‌గ్రాడ్‌లో జ‌ల‌ప్ర‌వేశం వేడుక‌ను నిర్వ‌హిస్తున్నారు. సుమారు 125 మీట‌ర్ల పొడుగు, 3900 ట‌న్నుల బ‌రువున్న ఈ యుద్ధ‌నౌక‌ను.. వెస్ట్ర‌న్ నావ‌ల్ క‌మాండ్‌లో మోహ‌రించ‌నున్నారు. ఆరేబియా స‌ముద్రంతో పాటు ప‌శ్చిమ హిందూ మ‌హాస‌ముద్రంలో ఈ యుద్ధ‌నౌక ప‌హారా కాయ‌నున్న‌ది.

ఐఎన్ఎస్ త‌మ‌ల్‌ను విదేశాల్లో నిర్మిస్తున్నారు. దీంట్లో 26 శాతం దేశీయ సిస్ట‌మ్స్ ఉన్నాయి. దీనికి బ్ర‌హ్మోస్ సూప‌ర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ సామ‌ర్థ్యం కూడా ఉంది. ఈ యుద్ధ‌నౌక‌లో ప్ర‌త్యేక‌మైన ఎస్‌హెచ్‌టీఐఎల్ వెర్టిక‌ల్ లాంచ్ ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్ ఉన్న‌ది. షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ లాంచ్ చేసే సామ‌ర్థ్యం ఉన్న‌ది. మ‌ధ్య‌శ్రేణి స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కూడా ఉంది. ఈ రెండు వ్య‌వస్థ‌ల‌తో .. క్రూయిజ్ మిస్సైళ్లు, హెలికాప్ట‌ర్లు, బాలిస్టిక్ క్షిప‌ణులను అడ్డుకోవ‌చ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -