Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకేర‌ళ సీఎంవో ఆఫీసుకు బాంబు బెద‌రింపు

కేర‌ళ సీఎంవో ఆఫీసుకు బాంబు బెద‌రింపు

- Advertisement -

న‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రధాని నరేంద్ర మోడీ కేరళ పర్యటన ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కేరళ మఖ్యమంత్రి కార్యాలయం ‘క్లిఫ్ హౌస్‌’, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆఫీస్‌లో సహా పలు కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్‌తో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తున్నారు. అయితే, ప్రధాని మే 2న కేరళను సందర్శించి విజింజం అంతర్జాతీయ ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు. జూలై 2024లో ఓడరేవు ట్రయల్ రన్ నిర్వహించి డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ఓడరేవు ప్రాజెక్టు ఆపరేషన్‌తో పాటు కంట్రోల్ సెంటర్లను సందర్శించారు. ఆదివారం తిరువ‌నంత‌పురం ఎయిర్‌పోర్టుకు కూడా బాంబు బెద‌రింపు ఈ-మెయిల్స్ వ‌చ్చాయి. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది..ఎయిర్‌పోర్టు అంతటా..క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఎలాంటి బాంబు ల‌భించ‌క‌పోవ‌డంతో ఊపిరి పిల్చుకున్నారు. తాజాగా కేర‌ళ సీఎంవో ఆఫీసుకు బాంబు బెద‌రింపు కాల్ క‌ల‌వ‌ర‌పెడుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad