Wednesday, July 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకజకిస్థాన్ కీల‌క నిర్ణ‌యం..

కజకిస్థాన్ కీల‌క నిర్ణ‌యం..

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:
బహిరంగ ప్రదేశాలలో ముఖాలను కవర్‌ చేయడంపై కజకిస్థాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ చట్టంలో మతం, మతపరమైన దుస్తులను ప్రస్తావించలేదు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ముఖాలను కప్పి వుంచేలా దుస్తులు ధరించడంపై నిషేధం విధిస్తూ కజకిస్తాన్‌ అధ్యక్షుడు కాసిమ్‌-జోమార్ట్‌ తోకాయేవ్‌ సోమవారం ఒక చట్టంపై సంతకం చేశారు. ముఖ గుర్తింపును అడ్డుకునేలా దుస్తులు ధరించడాన్ని నిషేధిస్తున్నట్లు ఈ చట్టం పేర్కొంది. అయితే వైద్య ప్రయోజనాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు మినహాయింపునిచ్చింది. మన దేశం నిర్దిష్టమైన గుర్తింపును పొందేందుకు ఈ చట్టం అవకాశం కల్పించనుందని టోకాయేవ్‌ గతంలో పేర్కొన్నారు. ముఖాన్ని కప్పివుంచే నల్లని వస్త్రాలు ధరించడం కంటే, తమ జాతికి గుర్తింపునిచ్చేలా దుస్తులు ధరించడం మంచిదని పేర్కొన్నారు.

ఇస్లామిక్‌ దుస్తుల ఆకృతులను పరిమితం చేసే అనేక మధ్య అసియా దేశాల్లో తాజాగా కజకిస్తాన్‌ కూడా చేరింది. కిర్గిజిస్తాన్‌ సైతం ఇస్లామిక్‌ నిఖాబ్‌పై (ముఖంపై ధరించే ముసుగు) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పోలీసులు గస్తీ కూడా నిర్వహిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఉజ్బెకిస్తాన్‌లో నిఖాబ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తే 250 డాలర్ల కంటే ఎక్కువ జరిమానా విధించబడుతుందని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో దేశ సంస్కృతికి విరుద్ధంగా దుస్తులు ధరించడాన్ని నిషేధించే చట్టంపై అధ్యక్షుడు ఎమోమాలి రఖ్మోన్‌ సంతకం చేసినట్లు తజకిస్తాన్ అధికారిక మీడియా తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -