Wednesday, July 2, 2025
E-PAPER
Homeసినిమాత్రీడీలో 'మహావతార్‌ నరసింహ'

త్రీడీలో ‘మహావతార్‌ నరసింహ’

- Advertisement -

పాన్‌ ఇండియా నిర్మాణ సంస్థ హోంబులే ఫిల్మ్స్‌తో కలిసి క్లీమ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ని రూపొందిస్తున్నారు. ఈ విజనరీ యానిమేటెడ్‌ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథకు జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్‌, భారతీయ పురాణాల బేస్డ్‌ కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్‌ స్కేల్‌తో అలరించబోతోంది. దర్శకుడు అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశారు, చైతన్య దేశారు నిర్మిస్తున్న ‘మహావతార్‌ నరసింహ’ మొదటి భాగం ఈనెల 25న ఐదు ప్రధాన భారతీయ భాషలలో అత్యాధునిక 3డీ ఫార్మాట్‌లో విడుదల కానుంది.
తాజాగా విడుదలైన ప్రోమో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రమాదం ఉన్న హిరణ్యకశిపుడిని పరిచయం చేసింది. కళ్లు చెదిరే విజువల్స్‌, అద్భుతమైన సంగీతం, కాలాన్ని ప్రతిధ్వనించే పౌరాణిక వైభవంతో ఈ ప్రోమో అధర్మం రాజ్యమేలుతున్న యుగం తాలూకా తీవ్రతను ప్రజెంట్‌ చేసింది. అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌, త్రీడీ విజువల్స్‌, పవర్‌ఫుల్‌ బీజీఎంతో ‘మహావతార్‌ నరసింహ’ భారతీయ సినిమాలో పౌరాణిక కథ చెప్పే స్కేల్‌ని రీడిఫైన్‌ చేస్తోంది. ఇది డివైన్‌ యూనివర్స్‌, విష్ణువు దశ అవతారాలను అద్భుతంగా ప్రజెంట్‌ చేస్తోంది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -