నవతెలంగాణ – రామగిరి : సింగరేణి ఆర్జి-3 ఏరియా టిబిజికెఎస్ ఉపాధ్యక్షులు రజక సంఘం పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగవెల్లి సాంబయ్య మాతృమూర్తి నాగవెల్లి గట్టమ్మ ఇటీవల హన్మకొండ జిల్లా, వేలేరు మండలం, ఎర్రబెల్లి గ్రామంలో మరణించారు. ఈ నేపథ్యంలో వారు ఆమె దశ దిన ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు మాదాసి శ్రీనివాస్, రామగిరి మండల సీనియర్ రిపోర్టర్ నల్లూరి లింగయ్య, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రాజమల్లు ,పెద్దపల్లి జిల్లా రజక విద్యార్థి విభాగం అధ్యక్షులు బండి రంజిత్ కుమార్ , మండల అధ్యక్షులు ధర్ముల రాజయ్య, సెంటినరీ కాలనీ పట్టణ అధ్యక్షులు పున్నం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి బండి మొండయ్య, చెలికట్ల మల్లేష్, కొడిపాక ఐలయ్య ,కొల్లూరి రాములు,తదితరులు పాల్గొన్నారు.