Thursday, July 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాశమైలారం ఘటన.. రూ.కోటి పరిహారం ప్రకటించిన సిగాచి

పాశమైలారం ఘటన.. రూ.కోటి పరిహారం ప్రకటించిన సిగాచి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని పాశమైలారంలో ఉన్న సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన ఘోర పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 40 మంది మరణించారని, మరో 33 మంది గాయపడ్డారని స్వయంగా సిగాచీ పరిశ్రమ ప్రకటించింది. కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు అన్ని రకాల బీమా క్లెయిమ్‌లను కూడా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

గాయపడిన వారికి పూర్తి వైద్య సేవలు అందిస్తూ.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ ప్రమాదంపై స్టాక్‌మార్కెట్‌కు కూడా లేఖ రాసిన వివేక్ కుమార్, తదుపరి మూడు నెలల పాటు కంపెనీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ దర్యాప్తు నివేదిక కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -