Wednesday, April 30, 2025
Homeకరీంనగర్నిబంధనలు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు

నిబంధనలు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు

నవతెలంగాణ-రామగిరి 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఓ ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాన్ని  విధి నిర్వహణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  దానిని సీజ్ చేయడం జరిగిందనీ,నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి స్కానింగ్ సెంటర్లను  తనిఖీ చేసే అధికారం ఉంటుందనీ అందులో భాగంగా వారు ఆ సెంటర్ ని సందర్శించి ఇలాంటి రిజిస్ట్రేషన్ లేని స్కానింగ్ సెంటర్ వలన చాలామందికి నష్టం జరుగుతుందని,  కాబట్టి వారిపై అధికారుల  ఆదేశానుసారం ఆ సెంటర్ కు పర్మిషన్ లేని కారణంగా దాన్ని సీజ్ చేయడం జరిగిందనీ,  దినిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్న సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని పట్ల దురుసుగా ప్రవర్తించారనీ,అదే కాకుండా ఆ అధికారిని ప పైన కేసు పెట్టారనీ, దానిని తెలంగాణ పారామెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మెడికల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి దేవి సింగ్, జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్, ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్,  మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ రమేష్,  తీవ్రంగా ఖండించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని పైన  పెట్టినటువంటి కేసును వెంటనే  ఉపసంహరించుకోవాలని, లేని యెడల వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో దశలవారీగా ఆందోళన చేస్తామని, అవసరమైతే విధులను కూడా బహిష్కరిస్తామని వారు తెలియజేసారు. అలగే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని వెంటనే సమస్యను పరిష్కరించాలని లేకుంటె ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img