నవతెలంగాణ – తుర్కపల్లి
మండలం వాసాలమర్రి గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ దేశ నాయక్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా ముగ్గులు పోసుకొని ఇండ్లను నిర్మించుకోవాలని అన్నారు. మేస్త్రీలు మార్కెట్ ధర కంటే ఎక్కువగా లబ్ధిదారుల నుండి వసూలు చేయకూడదని ఒకవేళ వసూలు చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం ఆదేశించిన కొలతల ప్రకారం బేస్మెంట్ 400 నుండి 600 అడుగుల వరకు మాత్రమే, 12 ఎం ఎం స్టీల్ రాడ్లను మాత్రమే పిల్లర్ నిర్మించుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు ఇసుక కోసం ఇబ్బందులు పడవద్దని మండలంలో కాకుండా పక్క మండలంలో ఉన్న వాగులో నుండి ఇసుక రవాణాకు అనుమతిని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి సిమెంటుకలను వాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్ డిఇ శ్రీరాములు, హౌసింగ్ ఏఈ స్వర్ణ, పంచాయితీ కార్యదర్శి ఒగ్గు మధు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమీక్ష సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES