- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా చేరియాల్‌గుట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చి కారు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఫిల్మ్ నగర్ ఎస్‌ఐ రాజేశ్వర్ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్పాట్ వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -