- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా అత్యున్నత పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా ఘనా వెళ్లిన ప్రధాని మోదీని ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఆ దేశం సత్కరించింది. రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమానీ మోదీకి ఈ అవార్డును అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ.. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -