నవతెలంగాణ – కోల్‌కతా : శుక్రవారం పశ్చిమబెంగాల్‌లోని పలు జిల్లాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్‌లో జరిగిన నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పది మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ముర్షిదాబాద్‌లో 110 మందికి పైగా నిరసనకారుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. కాగా, శుక్రవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు నింతిటా రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న రైలుపై రాళ్లతో దాడి చేశారు. స్టేషన్ ఆస్తిని ధ్వంసం చేశారు. పోలీసు వ్యాన్‌లతో సహా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి రోడ్లను దిగ్బంధించారు. ఈ ఘటనల నేపథ్యంలోనే పోలీసులు సుతి నుంచి 70 మందికిపైగా, సంసెర్‌గంజ్ నుంచి 41 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా శనివారం కూడా నిరసనలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నిరసనల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో నిషేధిత ఆజ్ఞలు అమల్లో ఉన్నాయని.. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు… 110 మంది అరెస్ట్
- Advertisement -
RELATED ARTICLES