Friday, July 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ పుట్‌బాల్ ప్లేయ‌ర్ మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ పుట్‌బాల్ ప్లేయ‌ర్ మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రోడ్డు ప్రమాదంలో స్టాప్ ఫుట్ బాల్ ప్లేయర్.. ఫార్వర్డ్ డియాగో జోటా (28) కన్ను మూశారు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు ఆండ్రే ఫెలిప్ (26) కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఫార్వర్డ్ డియాగో జోటా లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్, పోర్చుగల్ నేషనల్ ఫుట్ బాల్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. స్పెయిన్‌లోని జమోరా సమీపంలో జూలై 3, రాత్రి A-52 హైవేలో 65వ కిలోమీటర్ వద్ద వారు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఇందులో ఈ ఘోరమైన కారు ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో అన్నదమ్ములు ఇద్దరు అక్కడిక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషాద వార్తలు ఫుట్‌బాల్ ప్రేమికులను షాక్‌ కు గురి చేశాయి. ఇదిలా ఉంటే జోటా పది రోజుల క్రితమే వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -