Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐటీనే కాదు..బంగారానికి హైదరాబాద్ బ్రాండ్: సీఎం రేవంత్

ఐటీనే కాదు..బంగారానికి హైదరాబాద్ బ్రాండ్: సీఎం రేవంత్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైదరాబాద్ అంటే ఐటీనే కాకుండా బంగారానికి కూడా ఇకపై హైదరాబాద్ బ్రాండ్ కానుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంటే ఐటీనే కాకుండా ఫార్మా, రియల్ ఎస్టేట్, బల్క్ డ్రగ్స్ లోనూ హైదరాబాద్ సిటీ తన ప్రత్యేకతను చాటుకుందని.. ఇప్పుడు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్ లో రావటం అనేది శుభ పరిణామని అన్నారు. మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్ని మాట్లాడారు. ఒక్కో రంగంలో హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో పరిశ్రమల్లో దూసుకుపోతోందని అన్నారు.

పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా పారిశ్రామికవేత్తలకు మంచి అనువైన వాతావరణం కూడా తెలంగాణలో ఉందని అన్నారు సీఎం రేవంత్. ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్ మెంట్ పాలసీలు గత 30 ఏళ్లుగా స్థిరంగా కొనసాగుతున్నాయని.. ప్రభుత్వాలు మారినా వాటిలో మార్పు లేకుండా మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో నాలుగో నగరం నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామని.. మహేశ్వరం ప్రాంతం నాలుగో నగరం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

నాడు కులీ కుదుబ్ షాహీలు హైదరాబాద్ సిటీని నిర్మిస్తే..నిజాం నవాబులు హైదరాబాద్, సికింద్రాబాద్ నిర్మించారని అన్నారు.ఆ తర్వాత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు సైబరాబాద్ మూడో సిటీని నిర్మించారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతుందని అన్నారు సీఎం రేవంత్. మహేశ్వరంలో నియోజకవర్గం పరిధిలో 30 వేల ఎకరాలతో ప్రపంచంలోని అధునాతమైన నగరం నిర్మాణం కాబోతోందని అన్నారు సీఎం రేవంత్.

తెలంగాణలో హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. మలబార్ తయారీ యూనిట్ ను మహేశ్వరంలో ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని.. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్.

ప్రభుత్వాలు మారినా మన పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదని.. పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. వారికి లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్. తెలంగాణపై నమ్మకం ఉంచిన మలబార్ గ్రూప్ కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు సీఎం రేవంత్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -