Friday, July 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటిఎక్స్ హాస్పిటల్స్‌లో అరుదైనశాస్త్ర చికిత్స

టిఎక్స్ హాస్పిటల్స్‌లో అరుదైనశాస్త్ర చికిత్స

- Advertisement -

– తల్లి పిల్లల్ని కాపాడిన ఆస్పత్రి వైద్యులు
– గర్భధారణ కేసులో తల్లి, ఇద్దరు శిశువుల ప్రాణాలను కాపాడిన వైద్యులు
నవతెలంగాణ-అంబర్‌పేట : ప్లసెంటా పెర్క్రేటా, బ్లాడర్ ఇన్వేజన్ ట్విన్ ప్రెగ్నెన్సీ కలగలిపిన అత్యంత సంక్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించిన బంజారాహిల్స్ టిఎక్స్ హాస్పిటల్స్ టీం
బంజారాహిల్స్ లోని టిఎక్స్ హాస్పిటల్ లో వైద్యులు అరుదైన, ప్రాణాంతక గర్భధారణ సమస్యను విజయవంతంగా నిర్వహించి ఒక తల్లి మరియు ఆమె ఇద్దరు శిశువుల ప్రాణాలను కాపాడారు. ఈ కేసులో ప్లసెంటా పెర్క్రేటా అనే తీవ్రమైన సమస్య కనిపించింది — ఇది ప్లసెంటా గర్భాశయాన్ని దాటి మూత్రాశయం, సర్విక్స్ (గర్భాశయ ముఖం) వరకు పెరిగి వెళ్లే అరుదైన వైద్యం

ఆయేషా సిద్ధికా (29), జహీరాబాద్‌కు చెందిన, 28 వారాల గర్భంతో డీసీడీఏ (DCDA) ట్విన్ బిడ్డలతో తరచూ రక్తస్రావంతో బాధపడుతూ టిఎక్స్ హాస్పిటల్స్‌లో కు చేరారు. గతంలో ఆమెకు రెండు సిజేరియన్ డెలివరీలు గర్భాశయంపై సర్జరీ జరగడంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. మొదట అల్‌ట్రాసౌండ్‌లో అనుమానాస్పద ప్లసెంటా సమస్యలు కనిపించగా, ఎంఆర్ఐ స్కాన్ ద్వారా గ్రేడ్ IV ప్లసెంటా ప్రీవియా మరియు ప్లసెంటా పెర్క్రేటా నిర్ధారణ అయింది — ప్లసెంటా పూర్తిగా గర్భాశయాన్ని కవర్ చేస్తూ మూత్రాశయం లోపలకి కూడా ప్రవేశించింది.

ప్రపంచవ్యాప్తంగా అరుదైన పరిస్థితి
ట్విన్ ప్రెగ్నెన్సీ + ప్లసెంటా పెర్క్రేటా + బ్లాడర్ ఇన్వేజన్ కలిపిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 50,000 గర్భధారణల్లో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది
ఒక నిర్ణయాత్మక చర్య – మూడు ప్రాణాల రక్షణ
మొదటగా, రక్తస్రావాన్ని నియంత్రించేందుకు డాక్టర్ అవినాష్ దాల్* గారు (సీనియర్ కన్సల్టెంట్ – వాస్కులర్ సర్జన్), క్యాథ్ ల్యాబ్‌లో రెండు కామన్ ఇలియాక్ ఆర్టరీల్లో బాలూన్ క్యాథెటర్‌లు వేశారు
ఆపై, డాక్టర్. శృతి పలకొళ్లడాక్టర్ సుధ ఎస్* (గైనకాలజీ & అబ్‌స్టెట్రిక్స్ కన్సల్టెంట్లు) శస్త్రచికిత్స ప్రారంభించారు
ప్లసెంటా పూర్తిగా కవర్ చేసిన గర్భాశయం పై కత్తిరించడం కూడా ప్రమాదకరం, అందుకే రియల్‌టైమ్ అల్‌ట్రాసౌండ్ సహాయంతో సురక్షితమైన స్థలంలో ఖచ్చితమైన కోత చేశారు
ఒక 1 కిలో పురుష శిశువు, మరియు 760 గ్రాముల ఆడ శిశువు విజయవంతంగా జన్మించారు
వెంటనే బాలూన్‌లను వేగంగా వాపింపజేసి రక్తస్రావాన్ని నియంత్రించారు.
తర్వాత: సిజేరియన్ హిస్టరెక్టమీ (గర్భాశయ తొలగింపు) నిర్వహించబడింది
ప్లసెంటా మూత్రాశయాన్ని ఆక్రమించడంతో, దాదాపు 20% బ్లాడర్ టిష్యూను రిపేర్ చేయాల్సి వచ్చింది — అనీ డాక్టర్ హిదాయతుల్లా (సీనియర్ కన్సల్టెంట్ – యూరాలజీ) చురుకైన పర్యవేక్షణలో, డాక్టర్ రాజేష్ మద్దతుతో విజయవంతమైంది

అంతేకాక, డాక్టర్. డివిఎల్ నారాయణ రావు (సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ) డాక్టర్ అనిల్ జంపాని (కన్సల్టెంట్ సర్జన్) జీ.ఐ (గ్యాస్ట్రోఇంటెస్టినల్) అత్యవసర పరిస్థితుల కోసం బ్యాకప్‌గా సిద్ధంగా ఉన్నారు — ఇదొక అధిక ప్రమాద స్థితిలో కీలకమైన ప్రణాళిక భాగం

శస్త్రచికిత్స సమయంలో మరియు తర్వాతి ఐసీయూ సంరక్షణను డాక్టర్ ఏడుకొండలు* (సీనియర్ కన్సల్టెంట్ – అనస్థీషియా & క్రిటికల్ కేర్) మరియు డాక్టర్. సందీప్* (కన్సల్టెంట్ – అనస్థీషియా & క్రిటికల్ కేర్) గార్లు ఎంతో నిబద్ధతతో నిర్వహించారు అనీ

తల్లి – పిల్లలు ఆరోగ్యంగా బయటపడి… ఆశగా వెలిగిన కుటుంబం
ఈ ఆపరేషన్ అనంతరం 10 రోజుల పాటు continous పర్యవేక్షణ తర్వాత, జూన్ 28న ఆయేషా నీ ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేశారు.ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు, మేము ఒక తల్లిని, రెండు పసిపిల్లలను – ఒక కుటుంబాన్ని తిరిగి జీవితం వైపు తీసుకెళ్లిన ఘట్టం” అనీ సి ఓ ఓ డాక్టర్ వొడ్నాల. శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ కీర్తికారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ రాజు,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామిరెడ్డి రవీందర్ రెడ్డి, సీఈవో నవ్య వాణి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -