నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని అవది జిల్లాలో విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీకి చెందిన ఒక మహిళా కౌన్సిలర్‌ను ఆమె భర్త దారుణంగా నరికి చంపాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నడిరోడ్డుపైనే కత్తితో భార్యను విచక్షణ రహితంగా పొడిచి చంపాడు. బాధితురాలు గోమతి తిరునిన్రావూర్ ప్రాంతంలోని జయరామ్ నగర్ సమీపంలో మరొక వ్యక్తితో నిలబడి మాట్లాడుతూ ఉండగా ఆమె భర్త స్టీఫెన్ రాజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. దంపతుల మధ్య వాగ్వాదం చెలరేగి, మరింత తీవ్రమైంది. అకస్మాత్తుగా స్టీఫెన్ రాజ్ కత్తితో తన భార్య కౌన్సిలర్ గోమతి పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె స్పాట్ లోనే కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన తర్వాత, స్టీఫెన్ రాజ్ తిరునిన్రావూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.
నడిరోడ్డుపై మహిళ కౌన్సిలర్ దారుణ హత్య…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES