Saturday, July 5, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రాజాసింగ్ రాజీనామా.. గోషామహల్‌కు బై పోల్..?

రాజాసింగ్ రాజీనామా.. గోషామహల్‌కు బై పోల్..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎమ్మెల్యే రాజాసింగ్ పై అనర్హత వేటు కు రంగం సిద్దమైంది. పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ పైన బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఉంది. పార్టీ పైన కొంత కాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వేళ రాజాసింగ్ రాజీనామా నిర్ణయం ప్రకటించారు. అధినాయకత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తాను వ్యవహరిస్తానని రాజా సింగ్ చెబుతూ వచ్చారు. తాజాగా రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు లేఖ రాసేందు కు బీజేపీ సిద్దమైంది. దీంతో, గోషామహల్ కు బై పోల్ ఖాయంగా కనిపిస్తోంది.

బీజేపీలో వివాదాస్పదంగా మారిన రాజాసింగ్ వ్యవహారం పైన పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజాసింగ్ రాజీనామా.. వ్యాఖ్యల పైన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీకి నివేదిక పంపిన ట్లు సమాచారం. రాజాసింగ్ రాజీనామా లేఖను అధినాయకత్వానికి పంపారు. తాను బీజేపీ సింబల్ పైన ఎమ్మెల్యేగా గెలిచానని.. తన పదవి పైన అనర్హత వేటు కోరుతూ పార్టీ నేతలే స్పీకర్ కు లేఖ రాయాలని రాజాసింగ్ సూచించారు. ఆ తరువాత పార్టీ అధినాయకత్వం తన రాజీనామా లేఖ పైన స్పందన చూసిన తరువాత తన నిర్ణయం ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే, పార్టీ క్రమశిక్షణ ఉల్లఘించారనే కారణంతో రాజాసింగ్ విషయంలో మరో ఆలోచన వద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజీనామా ఆమోదానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -