Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈడీ విచారణకు హాజరైన నిర్మాత అల్లు అరవింద్

ఈడీ విచారణకు హాజరైన నిర్మాత అల్లు అరవింద్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి అరవింద్‌ను ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ చేశారు. అనంతరం అధికారులు అల్లు అరవింద్‌కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -