నవతెలంగాణ-హైదరాబాద్: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి విదితమే. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ” కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా గురువారం సాయంత్రం ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. ఆయన బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి రెండు రోజులు ఆస్పత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారు. కేసీఆర్ ఆరోగ్యం సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ” అని పేర్కొన్నారు. నిన్న రాత్రే కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ” కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఈ సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది ” అని వెల్లడించారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES