Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉర్దూ మీడియం విద్యార్థులకు వైద్య పరీక్షలు..

ఉర్దూ మీడియం విద్యార్థులకు వైద్య పరీక్షలు..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పెద్దగుళ్ల గ్రామంలో ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. జుక్కల్ మెడికల్ ఆఫీసర్ ఆదేశాలనుసారం ఆర్బీ ఎస్ వైద్యుడు విక్రమ్, ఉర్దూ మీడియం పాఠశాల ప్రధాన ఉపధ్యాయురాలు సమీనా బేగం ఆధ్వర్యంలో శుక్రవారం ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు ముందస్తుగా వారి బరువును తూకం వేసి, ఎత్తును పరిశీలించారు.

అనంతరం పిల్లలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వారిని స్వయంగా వైద్యుడు అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం లోపం ఉన్నవారు పిల్లలకు ప్రత్యేకమైన పౌష్టికాహారం అందించాలని వైద్యుడు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలిస్తున్నాను సందర్భంగా చికెన్ గున్యా,  మలేరియా, డెంగ్యు, వైరల్ ఫీవర్, వాంతులు, విరోచనాలు, ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందస్తుగానే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సమీనా బేగం , తెలుగు మీడియం పాఠశాల ప్రధానోపాద్యాయురాలు చంద్రకళ , ఉపాధ్యాయులు రాజు ,  దివ్య , ఆశ వర్కర్లు , అంగన్వాడీ టీచర్లు , వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -