Saturday, July 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాలో మితిమీరిన ఇజ్రాయిల్ ఆకృత్యాలు..

గాజాలో మితిమీరిన ఇజ్రాయిల్ ఆకృత్యాలు..

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్:
గాజాలో ఇజ్రాయిల్ ఆకృత్యాలకు హ‌ద్దుప‌ద్దు లేకుండా పోతుంది. పాల‌స్తీయ‌న్ల హ‌తమే ల‌క్ష్యంగా ఇజ్రాయిల్ సేన‌లు భీక‌ర దాడులు చేస్తుంది. మ‌రో ప‌క్క ప్ర‌జ‌ల‌కు నిత్య‌వ‌స‌ర స‌రకులు అంద‌కుండా అడ్డంకులు సృష్టిస్తుంది. అంతేకాకుండా ప‌లు దిగ్గ‌జ కంపెనీల స‌హాక‌రంతో దాడుల‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో మోస‌పూరిత ప‌న్నాగం వెలుగులోకి వ‌చ్చింది.

అమెరికా, ఇజ్రాయెల్‌ల మద్దతు ఉన్న దాతృత్వ సంస్థ, గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ (జీహెచ్‌ఎఫ్‌) పాలస్తీనీయులకు ఆహారం సరఫరా చేసే కేంద్రాలను ఏర్పాటుచేసింది. అయితే.. శరణార్థులు ఆహారం కోసం వస్తున్న సమయంలో ఆ కేంద్రాల వద్ద మహిళలు, వృద్ధులు, పిల్లలపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని మాజీ సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఎవరికీ ఎటువంటి ముప్పు కలిగించని, ఆకలితో అలమటిస్తున్న పౌరులపై కాల్పులు జరపడంతో వారు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరికొన్నిచోట్ల ప్రజలు ఆహారం కోసం వచ్చే మార్గంలో కాకుండా పక్కకు వెళ్తుండడంతో వారిని అదుపు చేయడానికి ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పులు జరిపిందని.. అయితే ఈ ఘటనల్లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపింది. ఈవిషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.

అయితే ఈ ఆరోపణలను గాజా మానవతా సంస్థ(జీహెచ్‌ఎఫ్‌) ఖండించింది. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద పౌరులపై ఎలాంటి కాల్పులు జరగలేదని వివరణ ఇచ్చింది. సహాయ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం.. అధిక ఆహారం చేజిక్కించుకోవాలన్న ఆతృతలో పలువురు పాలస్తీనియన్లు ప్రమాదకరమైన ఆయుధాలతో సిబ్బందిపై దాడికి ప్రయత్నించారని..వారిని నిలువరించడానికి ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -