Saturday, July 5, 2025
E-PAPER
Homeజాతీయంమ‌ణిపూర్‌లో భారీ స్థాయిలో ఆయుధాలు స్వాధీనం

మ‌ణిపూర్‌లో భారీ స్థాయిలో ఆయుధాలు స్వాధీనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మ‌ణిపూర్ లో భారీ మొత్తంలో ఆయుధాల‌ను భ‌ద్ర‌తా బ‌లగాలు స్వాధీనం చేసుకున్నాయి. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించాయి. 21 INSAS రైఫిల్స్, గ్రెనేడ్లు, IEDలు, SLRలు, AK సిరీస్ రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్, కేంద్ర భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌లో పాలు పంచుకున్నాయి. రెండు రోజులుగా కొండ జిల్లాల్లో సోదాలు నిర్వ‌హించి..ఈ భారీ మొత్తంలో ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -