Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య !

ఉరేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య !

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశంలోని కొమరోలు మండలం అక్కపల్లిలో ఈ సంఘటన జరిగింది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందుతుంది.

ఇవాళ తెల్లవారి జామున యువతి అలాగే యువకుడు ఇద్దరు కూడా చెట్టుకు వేలాడుతూ కనిపించారు. మృతులు నంద్యాల ప్యాపిలి మాధవరం వాసులుగా.. గుర్తించారు. ఇక ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -