Monday, July 7, 2025
E-PAPER
Homeకరీంనగర్బదిలీపై వెళుతున్న ఎఫ్ఓకు సన్మానం

బదిలీపై వెళుతున్న ఎఫ్ఓకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-రామగిరి : శనివారం జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా లో సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న  బి.కళ్యాణ్  మణుగూరు ఏరియాకు బదిలీపై వెళుతున్న సందర్బంగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, ఇతర అధికారులు  ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిఎం లు మాట్లాడుతూ,   ఏరియాలో సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న బి కళ్యాణ్  రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలలో ఆయన అందించిన సేవలు మరువలేనివని, విధి నిర్వహణలో నీతితో, అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని, మున్ముందు అదే పనితీరు కనబరిచి మంచి పేరు సంపాదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  ఎస్వో టు జిఎం  ఎం.రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, విభాగాధిపతులు కాశీ విశ్వేశ్వర రావు, చంద్రశేఖర్, సుదర్శనం, జనార్ధనరెడ్డి, ఐలయ్య, రాజేశ్వరి, షబ్బిరుద్దీన్, నాగేశ్వర రావు, ఉదయ భాస్కర్, చంద్రశేఖర్  తదితరులు పాల్గొన్నారు.   

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -