- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సాంకేతిక లోపంతో జూన్ 14న కేరళ తిరువనంతపురంలో ఎయిర్ పోర్టులో బ్రిటన్ కు చెందిన ఫైటర్ జెటర్ అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా విమానాన్ని ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు ఫైటర్ జెట్ మరమ్మతు పనులను చేసేందుకు యూకే నుంచి 24 మంది ఏవియేషన్ ఇంజినీర్ల బృందం.. ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో ఆదివారం కేరళకు చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో మరమ్మతులు చేయడానికి దానిని హ్యాంగర్‌కు తరలించారు. రానున్న రోజుల్లో దీన్ని సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానంలో తరలించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -