Monday, July 7, 2025
E-PAPER
Homeక్రైమ్గంజాయికి అలవాటు పడి.. దొంగతనాలు

గంజాయికి అలవాటు పడి.. దొంగతనాలు

- Advertisement -

ఇద్దరు మైనర్ బాలుర ఘాతకం

తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకి పాల్పడుతున్న వైనం

17 తులాల బంగారం.., 79 తులాల వెండి, 50 వేల విలువ గల 02 కిలోల గంజాయి స్వాధీనం

నల్గొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశంలో వెల్లడి.

నవ తెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : సోషల్ మీడియాలో రీల్స్ కి అలవాటు పడి, అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై రాత్రి వేళలో తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనాలకి పాల్పడుతున్న ఇద్దరు మైనర్ బాలురు, ఒక నిందితుడు , వారికి సహకరిస్తున్న ఒక మహిళని అరెస్ట్ చేసి 17 తులాల బంగారం.79 తులాల వెండి, 50 వేల విలువ గల 02 కిలోల గంజాయి తో పాటు. పల్సర్ ఎన్ఎస్ -200 బైక్ ( మొత్తం విలువ 20,00,000/-) స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండల పరిధిలోని నెమ్మాని గ్రామంలో గల రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గాలి యాదయ్య ఇంటిలో జూన్ 30న దొంగతనం జరిగిందని 22 తులాల బంగారం, 80 తులాల వెండి చోరీకి గురైనట్లు . నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సి ఐ, నార్కట్ పల్లి, ఆద్వర్యం లో ఎస్ ఐ నార్కట్ పల్లి , సిబ్బంది పలు బృంధాలు గా ఏర్పడి గాలిస్తున్న క్రమంలో లో ఆదివారం ఉదయం 500 గంటలకి నమ్మదగిన సమాచారం మేరకు నార్కట్ పల్లి గ్రామ శివారులో గల రెడ్డయ్య ఫ్యాక్టరీ ప్రక్కన వెంచర్ లో నలుగురు వ్యక్తులు నార్కట్ పల్లి చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయి అమ్మడం కొరకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం మేరకు నార్కట్ పల్లి ఎస్సై డి.క్రాంతి కుమార్, వారి సిబ్బందితో కలిసి నార్కట్ పల్లి గ్రామ శివారు లో రెడ్డయ్య ఫ్యాక్టరీ ప్రక్కన వెంచర్ దగ్గరలో వెళ్ళి అనుమానాస్పదంగా కనిపించిన . హైదరాబాద్ నగరానికి చెందిన9వ తరగతి చదివి మధ్యలో ఆపేసిన 14,16 సంవత్సరాల వయసుగల ఇద్దరు మైనర్. కుర్రాళ్ళు వారితోపాటు. బాజపల్లి జోసెఫ్ ,బోస్,ఎరిక్ విల్సన్, మాలిక్, లను అదుపులో తీసుకున్నారు.అట్టి నిందితుల ను విచారించగా సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం 2 కేజీల గంజాయిని కొనుగోలు చేసి గంజాయిని తీసుకొని గంజాయి తాగే వారికి నార్కట్ పల్లి చుట్టు ప్రక్కల అవసరం ఉన్న వ్యక్తులకు గంజాయిని అమ్మాలని ప్రయత్నిస్తున్నట్లు తేలింది అని పేర్కొన్నారు.వీరు గంజాయికు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ ఉండటంతో జవహర్ నగర్, నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినాయి. అయిన వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాక, చెడు వ్యసనాలకు అలవాటు పడి, సోషల్ మీడియాలో రీల్స్ కి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఒక మైనర్ బాలుడు యొక్క దగ్గరి బందువులు నార్కట్ పల్లి మండలం లో వుండటం వలన తన కి ఇట్టి ప్రాంతం పై అవగాహన వుండడం వలన నార్కట్ పల్లి మండలం లో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని తాము అనుకున్న పథకం ప్రకారముగా గంజాయి విక్రయించడంతో పాటు రాత్రి సమయంలో తాళం వేసి వున్న ఇండ్లను లక్షంగా చేసుకొని తాళం పగులగొట్టి దొంగతనాలకి పాల్పడుతున్నారు. ఎరిక్ విల్సన్ మెరీనా అను మహిళ వారికి సహకరిస్తుంది.

ఇట్టి నేరస్తులు మారణాయుుదాలని తమ వద్ద వుంచుకొని దొంగతనాలకి పాల్పడుతూ అడ్డు వస్తే చంపడానికి కూడా వెనకాడని గ్యాంగ్ అని చెప్పారు. .నార్కట్ పల్లి పోలీసు వారు పట్టుబడి చేసి నిందితుల వద్ద నుండి 2 కే‌జిల గంజాయి, బంగారు గాజులు, బంగారు పుస్తెలతాడు, బంగారు నక్లెస్, సిల్వర్ కుంకుమ బారనిలు, బంగారు చెవి రింగ్స్, బంగారు సదా రింగ్, బంగారు మాటీలు, గోల్డ్ కాయిన్స్, వెండి పట్టాగొలుసులు, వెండి కాయిన్స్, వెండి విగ్రహాలను మొత్తం 17.1 తులాల బంగారం, 79 తులాల వెండి , 1 ద్విచక్ర వాహనన్ని వీరు ఉపయోగించిన మారణాయుుదాలు అయిన కత్తి , బల్లెం కూడా స్వాదినం చేసుకున్నామని వెల్లడించారు. .

ఇట్టి నేరంలో వారిపై క్రైమ్ నెంబర్ .233/2025 అండర్ సెక్షన్ 8 (సి) 20(బి)(ii)(బి), 29 of ఎన్ డి పి ఎస్ యాక్ట్ -1985 సవరణ యాక్ట్ 2001 ప్రకారంగా నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పర్సినట్లు పేర్కొన్నారు.

నేరాలు నివారణకు ప్రత్యేక నిఘా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాదకద్రవ్య వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ఎంతటి వారినైనా ఉపేక్షించమని, యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని, గంజాయి, సరఫరా, అమ్మే వ్యక్తుల పైనే కాకుండా, సేవించే/వినియోగించే వ్యక్తుల పైన కూడా చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు . అలాగే జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ఠ నిఘా, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో దొంగతనాలు నివారణకు పగలు, రాత్రి పటిష్ఠ గస్తీ నిర్వహిస్తూ, పాత నేరస్తుల కదలికలపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టామని తెలిపారు. జిల్లా ప్రజలు కూడా మీ ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో, షాపులలో సిసిటివి కెమెరాలు అమర్చుకోవడం చాలా ముఖ్యమని, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలిక పై తగు చర్యలు తీసుకునుటకు వీటి ప్రాముఖ్యత చాలా అవసరం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో కాలనీల్లో,షాపులలో , ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.ఇట్టి కేసును నల్గొండ డి.ఎస్.పి, కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కట్ పల్లి సిఐకే నాగరాజు ఆద్వర్యంలో నార్కట్ పల్లి ఎస్ ఐ డి క్రాంతి కుమార్ , వారి సిబ్బంది ఏ ఎస్ ఐ-ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుల్ లు సత్యనారాయన, హరిప్రసాద్, శివశంకర్, తిరుమల్, శ్రీ క్రిష్ణ, మహేశ్, లను జిల్లా ఎస్ పి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -