Monday, July 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రజల ముందుకు అయతొల్లా ఖమేనీ

ప్రజల ముందుకు అయతొల్లా ఖమేనీ

- Advertisement -

యుద్ధం తర్వాత తొలిసారి
మత కార్యక్రమానికి హాజరు
టెహ్రాన్‌ :
ఇజ్రాయిల్‌తో 12 రోజుల పాటు జరిగిన యుద్ధం తర్వాత తొలిసారిగా ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ రాజధాని టెహ్రాన్‌లో ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. 85 సంవత్సరాల ఖమేనీ ప్రభుత్వ మీడియాలో ప్రసార మైన వీడియోలో కన్పించారు. షియా ముస్లింలకు పవిత్ర దినమైన అషురా సందర్భంగా ఓ మసీదులో జరిగిన కార్యక్రమానికి ఆయన వచ్చారు. ఈ కార్యక్రమానికి కొంతమంది షియాలు కూడా హాజరయ్యారు. హర్షధ్వానాలు చేస్తున్న ప్రజలకు ఖమేనీ చేతులు, తల ఊపుతూ అభివాదం చేయడం వీడియోలో కన్పించింది. సెంట్రల్‌ టెహ్రాన్‌లోని ఇమాం ఖమేనీ మసీదులో వీడియోను చిత్రీకరించారు.
జూన్‌ 13న ఇజ్రాయిల్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖమేనీ ప్రజలకు కన్పించడం లేదు. ఆయన ప్రసంగాలను ముందుగానే రికార్డు చేసి ప్రసారం చేస్తున్నారు. ఇరాన్‌ లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికలను ఖమేనీ గత నెల 26న తోసిపుచ్చారు. ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరంపై దాడి చేయడం ద్వారా ఇరాన్‌ దానికి చెంపదెబ్బ కొట్టిందని వ్యాఖ్యానించారు. కాగా ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -