Monday, July 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకన్నెపల్లి, కల్వకుర్తి నీటి మోటార్ల నడపండి

కన్నెపల్లి, కల్వకుర్తి నీటి మోటార్ల నడపండి

- Advertisement -

– లేదంటే రైతులతో కలిసి
మేమే ఆన్‌చేస్తాం : ప్రభుత్వానికి మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కన్నెపల్లి, కల్వకుర్తి నీటి వద్ద మోటార్లను వెంటనే నడపాలనీ, లేదంటే రైతులతో కలిసి తామే వాటిని ఆన్‌ చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలం గాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకే నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. నీటి విలువ తెలియని నేతలు పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీపై కోపంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురి చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి 73,600 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా ఎందుకు నీటిని ఎత్తి పోయడం లేదని ప్రశ్నించారు. మోటార్లు ఆన్‌ చేస్తే 15 జిల్లాలకు సాగునీరందుతుందని అన్నారు ఎస్సారెస్పీ కింద పంటలు వేసేందుకు రైతులు ఎదురు చూస్తూన్నారని గుర్తు చేశారు. ”శ్రీశైలానికి వరద వచ్చి 36 రోజులైనా కల్వకుర్తి మోటార్లు ఆన్‌ చేయలేదు. రెండు రోజుల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. వెంటనే ఆన్‌ చేస్తారో.. లేదో ప్రభుత్వం ప్రకటించాలి. ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సాగు, తాగునీటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వెంటనే కన్నెపల్లి పంప్‌ హౌస్‌ మోటార్లు ఆన్‌ చేయాలి” అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజీని ఎందుకు మరమ్మ తులు చేయలేదో చెప్పాలని నిలదీశారు. పోలవరంలో డయాఫ్రంవాల్‌ కొట్టుకుపోతే అక్కడికి ఎన్‌డీఎస్‌ఏ ఎందుకు పోలేదు? ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలిపోతే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం సమర్థిస్తోందని హరీశ్‌ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -