Monday, July 7, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నిరుద్యోగ అభ్యర్థులకు నెలకు రూ.5 వేలు..ద‌ర‌ఖాస్తు చేసుకోండి

నిరుద్యోగ అభ్యర్థులకు నెలకు రూ.5 వేలు..ద‌ర‌ఖాస్తు చేసుకోండి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణలోని స్టడీ సర్కిళ్లు ఉచితంగా శిక్షణను అందిస్తూ వారికి తోడ్పాటును అందిస్తున్నారు. వివిధ పోటీ పరీక్షల కోసం ప్రతి ఏటా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిళ్ల ద్వారా అవగాహన కల్పించడమే కాకుండా శిక్షణను కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సంబంధించి లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ కోసం ప్రకటనను విడుదల చేసింది.
ఈ నెల 8వ తేదీతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందని, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా 100 మందిని ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయిన 50 మందికి నేరుగా ప్రవేశం కల్పించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు సైదాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ నిపుణులైన అధ్యాపకుల చేత తొమ్మిది నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇప్పించబోతున్నారు. ఉచిత శిక్షణతోపాటు ఉచితంగా పుస్తకాలను కూడా అందించనున్నారు.


నెలనెలా స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. ప్రవీణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో జిల్లా స్థాయిలో గ్రూప్స్, ఇతర ఉచిత శిక్షణ తీసుకున్న అభ్యర్థులు కూడా ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ ఉచిత శిక్షణ కోసం ఈ నెల 12వ తేదీన ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ రాసి ఉత్తీర్ణులైన 50 మంది అభ్యర్థులను ఎంపిక చేసి, మొత్తం 150 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ నెల 25 నుండి 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుంది. నెలకు ఐదువేల రూపాయల స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి. ప్రవీణ్ కుమార్ కోరారు.

ద‌ర‌ఖాస్తు కొర‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -