-వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యుల బృందం
నవతెలంగాణ-పెద్దవూర
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జాగ్రత్తలతోనే వాటికి దూరంగా ఉండొచ్చని వైధ్యాధికారి నగేష్ అన్నారు. సోమవారం పర్వేదుల మండల కేంద్రం లోని ప్రాథమిక పాఠశాలలో వైద్య శిభిరం నిర్వహించారు.వ్యాధుల కాలంలో టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు సోకినపుడు తీసుకునే ఆహారం విషయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిబిరాల్లో రోగులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతుండగా వారి రక్తపూతలు సేకరించి అవసరమైన మందులను అందించారు. దోమలు నివాసం ఉండే ప్రాంతాలను గుర్తించి నివారణచర్యలు చేపట్టాలని, గ్రామస్థులకు ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన కలిగించారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నసమస్య వచ్చినా వెంటనే వైద్యశాలకు వచ్చి చికిత్స పొందాలన్నారు. రోగాలు సోకినపుడు మాంసాహారాలను దూరంగా ఉండాలని కోరారు. అనారోగ్యా నికి గురయితే దగ్గరలోని ఆశా, ఏఎన్‌ఎం, హెచ్‌ఏల వద్ద పరీక్షలు చేయించుకోవాలని, వారి సూచనలు మేరకు వైధ్యులను సంప్రదించాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా,నీటి నిల్వలు లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ సువర్ణ కుమారి,ఎంఎల్ హెచ్ పీ త్రివేణి,ఏఎన్ఎం బొడ్డు విజయలక్ష్మి,ఆశా వర్కర్లు గౌసియా బేగం,సునీత వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జాగ్రత్తలతోనే వ్యాధులు దూరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES