Monday, July 7, 2025
E-PAPER
Homeఆటలుట్రిపుల్ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా ఆల్ రౌండర్

ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా ఆల్ రౌండర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్, ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బులవాయో వేదికగా  క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో టెస్టులో తొలిసారి 300 పరుగులు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ మార్క్ అందుకున్న ఈ సఫారీ ఆల్ రౌండర్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా  రికార్డులకెక్కాడు. ముల్డర్ ఇన్నింగ్స్ లో 38 ఫోర్లు, 3 సిక్సలు ఉన్నాయి.


ట్రిపుల్ సెంచరీ తర్వాత కూడా ముల్డర్ తన బ్యాటింగ్ లో మరింత వేగం పెంచాడు. ప్రస్తుతం 364 పరుగులు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇదే ఊపు కొనసాగిస్తే లారా 400 అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్ బద్దలయ్యే అవకాశం కనిపిస్తుంది. తొలి రోజు 264 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగించిన ముల్డర్.. రెండో రోజు దూకుడుగా ఆడి తన ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీమిండియా బ్యాటర్ సెహ్వాగ్ తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ముల్డర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -