Tuesday, July 8, 2025
E-PAPER
Homeజాతీయంఈసీ నిర్ణ‌యంతో బీహార్ ఓట‌ర్ల‌కు ప్ర‌మాదం: అసదుద్దీన్‌ ఒవైసీ

ఈసీ నిర్ణ‌యంతో బీహార్ ఓట‌ర్ల‌కు ప్ర‌మాదం: అసదుద్దీన్‌ ఒవైసీ

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌ లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) పేరుతో ఓటర్‌ లిస్టును సవరించాలని నిర్ణయించడంపై ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అసహనం వ్యక్తం చేశారు.

తాను ఓటర్‌ జాబితా సవరణకు వ్యతిరేకంగా కాదని, కానీ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు జాబితాను సవరించాలనుకోవడం సముచితం కాదని అన్నారు. ప్రజలకు కొంత సమయం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీహార్‌ ఓటర్ లిస్టు సవరణపై తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఓటర్‌ జాబితాను సవరించడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తీరుతో బీహార్‌ పౌరులు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, ఎలాంటి సమస్యలు ఎదురుకానున్నాయనే విషయాన్ని తాను ఎన్నికల సంఘం దృష్టికి తెలియ‌జేడానికి ఇక్కడికి వచ్చానని ఒవైసీ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -