Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలురాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో గోల్డ్ చోరీ

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో గోల్డ్ చోరీ


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనం జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట 30 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్‌ చేయడానికి గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ఆపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img