Tuesday, July 8, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో ఆర్జేడీకి ఎస్పీ మ‌ద్ద‌తు

బీహార్‌లో ఆర్జేడీకి ఎస్పీ మ‌ద్ద‌తు

- Advertisement -


నవతెలంగాణ-హైద‌రాబాద్: బీహార్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆర్‌జెడికి సమాజ్‌వాది పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌యాదవ్‌ అన్నారు. నేడు ఆయన లక్నోలో సమాజ్‌వాది పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… ‘బీహార్‌ ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌జీ, తేజస్వియాదవ్‌జీకి మేము మద్దతు ఇస్తాము. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి చేసిన మోసాలు అక్కడ బయటపడతాయి. ప్రజలకు నిజమేంటో తెలుస్తుంది. బీజేపీ నితీష్‌ పేరుని ఉపయోగిస్తోంది. కానీ ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేయరు. నితీష్‌ని మేము ఒకప్పుడు ప్రధానమంత్రిగా చూపించాలనుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి.. ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి కూడా రిటైర్‌ అవుతారు. బీజేపీ ఆయనను బలవంతంగా పదవీ విరమణ చేయిస్తుంది.’ అని అన్నారు.

అలాగే కాషాయపార్టీ మతపరమైన భావజాలంలో కపట వైఖరితో ఉంటుందని అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. అన్యాయం చేసేవారు, వివక్ష చూపేవారు, పిల్లలను రాజకీయాల కోసం ఉపయోగించుకునేవారు తమను తాము సనాతనీయులు అని పిలుచుకోలేరు అని ఆయన అన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ‘నేటి రాజకీయాల్లో కేవలం కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన ఒకరిని ‘బాబా’ లేదా యోగి అని చెప్పలేము. నిజమైన గుర్తింపు, ఆలోచన ప్రవర్తన నుండి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుంచి బిజెపి దృష్టిని మళ్లిస్తోందని అఖిలేష్‌ విమర్శించారు. వారు ప్రాథమిక సమస్యలను చర్చించడానికి ఇష్టపడరు. కానీ ప్రజలు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. 2027లో జరిగే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు.. మీరు ఇంతకుముందు చూడని ఇతర పోల్‌ల మాదిరిగా ఉంటాయి అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -