నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రపంచ నేతలు అందించిన మద్దతు, సంఘీభావం, అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదాన్ని సహించబోమన్న ధోరణికి నిదర్శనమని భారత్ పేర్కొంది. సోమవారం యుఎన్ ఉగ్రవాద నిరోధక కార్యాలయంలో జరిగిన ‘ఉగ్రవాద బాధితుల సంఘం నెట్‌వర్క్’ కార్యక్రమంలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన పటేల్ పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2008లో జరిగిన 26/11 ముంబయి ఉగ్రదాడుల తర్వాత పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పౌరుల సంఖ్య అత్యధికమని అన్నారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదంతో బాధపడుతున్న భారత్ ఇటువంటి చర్యలు బాధితులు, వారి కుటుంబాలు మరియు సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని పూర్తిగా అర్థం చేసుకుందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నేతలు, ప్రభుత్వాలు అందించిన బలమైన, స్పష్టమైన మద్దతు మరియు సంఘీభావాన్ని భారత్ ధన్యవాదాలు తెలుపుతుందని, విలువైనదిగా భావిస్తుందని అన్నారు. ఇది అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించదనే దానికి నిదర్శనమని అన్నారు.
ఉగ్రవాదాన్ని సహించబోమన్న ధోరణికి నిదర్శనం: భారత్
- Advertisement -