నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇంట్లో… విషాదం చోటుచేసుకుంది. ఎం ఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్త అలియాస్ కోడూరి సుబ్బారావు మృతి చెందారు. 92 సంవత్సరాలు ఉన్న శివశక్తి… హైదరాబాద్ లో తాజాగా కన్నుమూశారు.
అర్థరాత్రి ఆయన మరణించినట్లు తెలుస్తోంది. దీంతో కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇది ఇలా ఉండగా… తెలుగు చిత్ర పరిశ్రమలో… RRR, చత్రపతి, సై, రాజన్న, బాహుబలి అలాగే హనుమాన్ సినిమాలకు పాటలు కూడా రాశాడు శివశక్తి. కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా కూడా పనిచేశారు. ఇది ఇలా ఉండగా దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అలాగే శివశక్తి ఇద్దరూ అన్నదమ్ములన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన అంత్యక్రియలు ఇవాళ రాత్రి జరిగే అవకాశం ఉంది.