Tuesday, July 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ సుంకాల‌ బెదిరింపుపై బ్రెజిల్ ఫైర్

ట్రంప్ సుంకాల‌ బెదిరింపుపై బ్రెజిల్ ఫైర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బ్రెజిల్‌ వేదిక‌గా బ్రిక్స్ సదస్సు జరుగుతున్న వేళ ట్రంప్ ..అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు.ఈ వ్యాఖ్య‌ల‌పై బ్రిక్స్ కూట‌మి స‌భ్య‌దేశాలు కౌంట‌ర్ ఇస్తున్నాయి. వాణిజ్య యుద్ధంలో విజేత‌లెవ‌రూ ఉండ‌ర‌ని, బ్రిక్స్ ఎవ‌రితో ఘ‌ర్ష‌ణ ప‌డంద‌ని, అంద‌ర్ని క‌లుపుకోని పోయే సానుకూల శ‌క్తి అని చైనా విదేశాంగ శాఖ కౌంట‌ర్ ఇచ్చింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్య‌లపై బ్రెజిల్ తీవ్రంగా స్పందించింది.

ప్ర‌పంచానికి చ‌వ్ర‌వ‌ర్తి అవ‌స‌రంలేద‌ని ఆ దేశ ప్రెసిడెంట్ లూయిస్ ఇన్నాసియో లూలా డా సిల్వా ఎద్దేవా చేశారు. తమ దేశంతో పాటు BRICS కూటమిలోని ఇతర సభ్యదేశాలన్నీ సార్వభౌమత్వం కలిగిన స్వతంత్ర దేశాలేనని ఆయన గుర్తు చేశారు. అమెరికా నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలపై ప్రభావం చూపడం సరైనది కాదని బ్రెజిల్‌ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో లూలా మాట్లాడారు.. ఒకరిని ఎదుర్కోవడం కోసం బ్రిక్స్‌ ఎవరికీ హాని చేయదని, కానీ రాజకీయాలు చేసేందుకు మరో ఉదాహరణ ఉండాలని మాత్రమే ఈ కూటమి కోరుకుంటోందని లూలా వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -