నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై సమాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూలో వీఐపీలకు ఉన్న సెక్యూరిటీ..సాధారణ ప్రజలకు ఎందుకు కల్పించలేదని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పలు ప్రయివేటు కార్యకాలాపాలకు భద్రత కల్పించినప్పుడు..జన సంచారమున్న ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఎందుకు చేపట్టలేదన్నారు.ఈ ఘటనపై నిజనిజాలు తెలియాల్సిందన్నారు. బాధిత కుటుంబాలకు సమాధానం బాధ్యత కేంద్రంపై ఉందని అఖిలేష్ యాదవ్ నొక్కిచెప్పారు. ప్రచారాలతో ప్రకటనలు మారవచ్చుగానీ, సత్యాన్ని మార్చలేమన్నారు.
జమ్మూలో వీఐపీలకు ఉన్నా భద్రత.. సాధారణ ప్రజలకు ఎందుకు లేదు: అఖిలేష్ యాదవ్
- Advertisement -