Wednesday, July 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇవాళ ఆయన ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహబూబాబాద్ నియోజవర్గ పర్యటనలో భాగంగా సొమ్లా‌తండాలో హెలి‌ప్యాడ్ వద్దకు ఇన్నోవా క్రిస్టా కారులో వేం నరేందర్ రెడ్డి వెళ్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా కారులోంచి బయటకు తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా.. సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -