Wednesday, July 9, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటెక్సాస్ వ‌ర‌ద‌ల‌పై వైట్ హాస్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

టెక్సాస్ వ‌ర‌ద‌ల‌పై వైట్ హాస్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆకస్మిక వరదలు టెక్సాస్‌ నగరాన్ని ఘోరంగా దెబ్బకొట్టింది. ఊహించని రీతిలో వరదలు సంభవించడంతో టెక్సాస్ అతలాకుతలం అయిపోయింది. టెక్సాస్‌లో ఇప్పటి వరకు 104 మంది చనిపోయారని వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఇక డజన్ల కొద్దీ గల్లంతైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. సమ్మర్ క్యాంప్‌లో ఉన్న పిల్లల ఆచూకీ ఇంకా తెలియలేదు. చెట్లపై అనేక మంది శరీరాలు ప్రత్యక్షమయ్యాయి. చెట్లలోనూ… పుట్టల్లోనూ చిక్కుకున్న మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీస్తున్నారు.

ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్.. శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి జరిగిన విపత్తును పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో భేటీ అయి.. జరుగుతున్న సహాయ చర్యలపై అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ట్రంప్ సంతాపం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -