నవతెలంగాణ-హైదరాబాద్: వేల కోట్లు తీసుకుని భారత్ బ్యాంకులకు పంగనామాలు పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీకి… బెల్జియం కోర్టులో చుక్కెదురైంది. ఆ దేశ పోలీసులను అరెస్టును సవాల్ చేస్తు కోర్టులో పిటిషన్ వేశారు. ఛోక్సీ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగ్గా.. కేసును వాయిదా కోర్టు వేసింది. తదుపరి విచారణ ఈ తేదీన ఉంటుందో తెలియాల్సింది. తన అరెస్టు విషయంతో బెల్లియం పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్ లో ఛోక్సి పేర్కొన్నాడు. గత వారం ఆనోరోగ్యం కారణాలు చూపుతూ ఆయన బెయిల్ కోసం ఆప్పిల్ చేసుకోగా..న్యాయస్థానం ఛోక్సి పిటిషన్ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం ఛోక్సీ..బెల్జియంలో ఉన్న తన భార్య వద్ద ఆశ్రమం పొందుతున్నారు. బెల్జియం పౌరసత్వంతో పాటు పలు దేశాల పౌరసత్వాలు కలిగ ఉన్నారని ఆయనను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఛోక్సిని భారత్ రప్పించడానికి కేంద్రం పలు ప్రయత్నాలు చేస్తోంది.
బెల్జియం కోర్టులో ఛోక్సికి చుక్కెదురు
- Advertisement -
RELATED ARTICLES