Wednesday, April 30, 2025
Homeజాతీయంప్ర‌ధాని మోడీపై ఎంపి జైరాం రమేష్ సెటైర్లు

ప్ర‌ధాని మోడీపై ఎంపి జైరాం రమేష్ సెటైర్లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పహల్గాం ఉగ్రదాడిపై అఖిల పక్ష సమావేశానికి ప్రధాని మోడీ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేష్‌ మండిపడ్డారు. రాబోయే బీహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీకి సమయం ఉంది, కానీ అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకు సమయం లేదని ఎద్దేవా చేశారు. బాధ్యత వహించాల్సి సమయంలో ప్రధాని మోడీ ‘గాయబ్‌’ (మాయమయ్యారు) అంటూ ఆయన సోమవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ఏప్రిల్‌ 22న అఖిల పక్షం నిర్వహించాలని డిమాండ్‌ చేశామని అన్నారు. ప్రధాని విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చారు కానీ, బీహార్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని అన్నారు. ప్రధానికి బీహార్‌ ఎన్నికల పచారంలో ప్రసంగించేందుకు సమయం ఉంది కాని అఖిలపక్ష సమావేశంలో ప్రసంగించేందుకు సమయం లేదని అన్నారు. పార్లమెంట్‌ ప్రత్యేక సెషన్‌ నిర్వహించాలని, దీనిలో అంశంపై రాజకీయ ఎజెండా లేదని అన్నారు. మనమంతా ఐక్యంగా ఉన్నామని ప్రపంచానికి చూపించడానికి, ఐక్యంగా ఉండాల్సిన సమయమిదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img