- టిజిఈ జేఏసీ ఉద్యోగ కార్యచరణ
నవతెలంగాణ – జుక్కల్ టిజిఈజేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 57 సమస్యల పరిష్కారానికి, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం సమర్పించడంలో భాగంగా జుక్కల్ మండల కేంద్రంలో, జుక్కల్ శాసనసభ్యులైనటువంటి తోట లక్మి కాంతరావుకు ఉద్యోగుల, గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల, వర్కర్స్ సమస్యలపై మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్మి కాంతరావుకి పెండింగ్ బిల్స్, పెండింగ్ 5 డిఎ లు. పి ఆర్ సి , హెల్త్ కార్డులు, సిపిఎస్ రద్దు, పెన్షనర్ల బకాయిలు, ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజ్ మొదలగు 57 సమస్యలను టిజిఈ జేఏసీ చైర్మన్ నరాల వెంకటరెడ్డి వారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రితో చర్చించి , అన్ని రకాల ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను ప్రవేశపెట్టాలని మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా హామీలను నిలబెట్టుకోవాలని వారినీ కోరడం జరిగింది.ఈ సందర్భంగా జుక్కల్ శాసన సభ్యులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేస్తాననీ నా మీద ఉన్న నమ్మకంతో మీ సమస్యలను నా దృష్టికి తీసుకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టిజిఈ జేఏసి చైర్మన్ వెంకట్ రెడ్డి, సెక్రటరీ జనరల్ డాక్టర్ దేవేందర్, అడిషనల్ సెక్రటరీ జనరల్ అల్లాపూర్ కుశాల్ తో పాటు ఈ కార్యక్రమంలో టిజిఈ జేఏసి లో ఉన్నటువంటి 27 సంఘాల ప్రతినిధులు నరాల వెంకట్ రెడ్డి , సెక్రటరీ జనరల్ టీజేఏసీ ఎ. కుశాల్ పి ఆర్ టి యు టీఎస్ శ్రీనివాస్ రెడ్డి టి టి పి టి ఎస్ . ఎమ్ నాగరాజు జిల్లా కార్యదర్శి టిఎన్జీవో డాక్టర్ బండి వార్ విజయ్ మరియు జుక్కల్ మండల బాధ్యులు లాలయ్య , శ్రీనివాస్ చంద్రకాంత్ గౌడ్ మద్నూర్ మండల బాధ్యులు , శివరాం మరియు భీమ్ బిచ్కుంద మండల బాధ్యులు శ్రీనివాస్, ఇర్షాద్ డోంగ్లి మండల బాధ్యులు సునీల్ మరియు మారుతి కొడప్ గల్ మండల బాధ్యులు జగదీష్ కిషోర్, టీజీ ఈ జేఏసీ బాద్యులు , రాష్ట్ర,జిల్లా బాధ్యులు, ఉద్యోగులు , తదితరులు పాల్గొన్నారు.