Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంఅగ్రదేశంపై తాము గెలుస్తాం..కెనడియన్లు ఐక్యంగా ఉండాలి: కార్నీ

అగ్రదేశంపై తాము గెలుస్తాం..కెనడియన్లు ఐక్యంగా ఉండాలి: కార్నీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ట్రంప్‌ మొదలుపెట్టిన వాణిజ్యయుద్ధంలో అగ్రదేశంపై తాము గెలుస్తామని కార్నీ ప్రజలకు హామీ ఇచ్చారు. అమెరికా తమకు చేస్తున్న ద్రోహాన్ని ఎన్నటికీ మరిచిపోవ్దని.. దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కెనడా అనుసరిస్తున్న ఐక్యత, అభివృద్ధి, స్థితిస్థాపకత వంటి విలువలను తాను ముందుకు తీసుకెళ్తానని అన్నారు. కెనడా గతంలో కంటే బలంగా పుంజుకుంటుందని అన్నారు. ప్రజల్లో విభేదాలు సృష్టించి, విచ్ఛిన్నం చేసి కెనడాను సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ త‌రుణంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. ప్ర‌తీకార సుంకాల‌తో డొనాల్డ ట్రంప్ కెన‌డాపై ట్రేడ్ వార్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కెన‌డా ఆటో మొబైల్ రంగాన్ని దెబ్బ‌తీసే విధంగా 25శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో అమెరికా దుశ్చ‌ర్య‌కు కెనడా కూడా అదే స్థాయిలో 25శాతాన్ని సుంకాలు విధించి. అంతేకాకుండా ట్రంప్ అధికారం చేప‌ట్ట‌గానే..కెన‌డా దేశాన్ని అమెరికాలో విలీనం చేస్తామ‌ని అహంకార పూర్తి వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో నూతన ప్రధానిగా మార్క్‌ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్ట‌పోయే ముందు..అమెరికాకు కౌంట‌ర్ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img