Friday, July 11, 2025
E-PAPER
Homeక్రైమ్కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురి మృతి

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఓ కుటుంబం ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి కడప జిల్లా మైదకూరు వెళుతుండగా.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద స్కార్పియో వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలిలో మున్ని (35), షేక్‌ కమాల్‌ బాషా(50) మృతి చెందగా, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మూడేళ్ల చిన్నారి షేక్‌ నదియా కన్నుమూసింది. మరో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -