Friday, July 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రెజిల్ ఎగుమ‌తుల‌పై ట్రంప్ సుంకాల మోత‌

బ్రెజిల్ ఎగుమ‌తుల‌పై ట్రంప్ సుంకాల మోత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బ్రెజిల్ ఎగుమ‌తుల‌పై ట్రంప్ సుంకాల మోత మోగించారు. ఆ దేశంపై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ దేశ‌ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ను వేధిస్తున్నారని, అందుకుగాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్ల‌డించారు.

ఇటీవల తమ విధానాలను వ్యతిరేకించే బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తానంటూ ట్రంప్‌ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ప్రపంచానికి చక్రవర్తి అవసరం లేదంటూ బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

ప్ర‌పంచానికి చ‌వ్ర‌వ‌ర్తి అవ‌స‌రంలేద‌ని ఆ దేశ ప్రెసిడెంట్ లూయిస్ ఇన్నాసియో లూలా డా సిల్వా ఎద్దేవా చేశారు. తమ దేశంతో పాటు BRICS కూటమిలోని ఇతర సభ్యదేశాలన్నీ సార్వభౌమత్వం కలిగిన స్వతంత్ర దేశాలేనని ఆయన గుర్తు చేశారు. అమెరికా నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలపై ప్రభావం చూపడం సరైనది కాదని బ్రెజిల్‌ లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో లూలా మాట్లాడారు.. ఒకరిని ఎదుర్కోవడం కోసం బ్రిక్స్‌ ఎవరికీ హాని చేయదని, కానీ రాజకీయాలు చేసేందుకు మరో ఉదాహరణ ఉండాలని మాత్రమే ఈ కూటమి కోరుకుంటోందని లూలా వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఇలా సుంకాలు విధించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -