Friday, July 11, 2025
E-PAPER
Homeజాతీయంలోకో పైలెట్ అల‌ర్ట్‌తో త‌ప్పిన పెను ప్ర‌మాదం

లోకో పైలెట్ అల‌ర్ట్‌తో త‌ప్పిన పెను ప్ర‌మాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జమ్మూకశ్మీర్ లో ఓ గూడ్స్ రైలు ప్ర‌మాదశాత్తు ప‌ట్టాలు త‌ప్పింది. జ‌మ్మూ నుంచి పంజాబ్‌ (Punjab)కు సరుకుతో వెళ్తున్న గూడ్స్ రైలు జిల్లా కఠువా జిల్లా లఖన్‌పూర్ (Lakhanpur) ప్రాంతం వద్దకు రాగానే ఉన్నట్టుండి పట్టాలు తప్పింది. దీంతో అప్రమత్తమైన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులువేసి ట్రైన్‌ను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో ఆ రూట్లో పలు ట్రైన్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతోనే ట్రైన్ పట్టాలు తప్పిందని ఘటనా స్థలానికి వెళ్లిన రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సాయంత్రానికి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు తిరిగి పంజాబ్‌నకు బయలుదేరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -