నవతెలంగాణ హైదరాబాద్:
కుకట్ పల్లి కల్తీ కల్లు బాధితులను నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. 31 మంది నిమ్స్‌లో చికిత్స పొందుతున్నరని… ఒక నలుగురికి మాత్రం డయాలసిస్ చేస్తున్నారు. మిగతాందరి పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. ఒక నాలుగైదు రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఘటనపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చర్యలుంటాయి అని మంత్రి తెలిపారు.