Wednesday, April 30, 2025
Homeజిల్లాలుసన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం 

సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం 

నవతెలంగాణ – దుబ్బాక 
రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ దుబ్బాక మండల కోఆర్డినేటర్లు చిలివేరి రాంరెడ్డి, తాడేం వెంగళరావు అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్  అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయిపల్లి వార్డులో చెరుకూరి భూపతి ఇంట్లో కాంగ్రెస్ నాయకులు సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎసురెడ్డి,రవీందర్,నరేందర్,పద్మయ్య, పలువురున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img